కలిసి తిరిగారు.. ఎక్కడ బెడిసికొట్టిందో: బండి భగీరథ్ కేసుపై బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
- పోక్సో కేసులో అరెస్టైన బండి భగీరథ్
- దీనితో బీజేపీకి సంబంధం లేదని రాకేశ్ రెడ్డి స్పష్టీకరణ.
- రెండు కుటుంబాల మధ్య వ్యవహారమన్న ఎమ్మెల్యే
- అమ్మాయే స్వయంగా భగీరథ్‌ను కారులో తీసుకెళ్లినట్లు వెల్లడి
- కలిసి తీర్థయాత్రలకు వెళ్లినట్లు చెప్పిన బీజేపీ నేత
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పోక్సో కేసులో అరెస్టు కావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి ఈ కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదంతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.
కుటుంబాల మధ్య గొడవ
ఈ కేసు పూర్తిగా రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవ అని ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాకేశ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తమకు వచ్చిన కొన్ని వీడియోల ప్రకారం ఆ రెండు కుటుంబాల మధ్య ఎంత సాన్నిహిత్యం ఉందో అర్థమవుతుందని చెప్పారు.
చిన్నప్పటి స్నేహం
బాధిత అమ్మాయి తల్లి భగీరథ్‌కు ఎంతో ప్రేమగా గోరు ముద్దలు తినిపించిన దృశ్యాలు ఆ వీడియోల్లో ఉన్నాయని ఎమ్మెల్యే వెల్లడించారు. అలాగే బాధిత అమ్మాయే స్వయంగా భగీరథ్‌ను కారులో తీసుకెళ్లినట్లు తెలిపారు. వారిద్దరూ చిన్నప్పటి నుంచి బావమరదళ్లలా కలిసి తిరిగారని, కలిసి పెరిగారని పేర్కొన్నారు.
తీర్థయాత్రలకు కూడా..
ఆ రెండు కుటుంబాలు కలిసి శ్రీశైలం, అరుణాచలం వంటి ప్రముఖ తీర్థయాత్రలకూ వెళ్లారని రాకేశ్ రెడ్డి వివరించారు. అంత బాగా ఉన్న సంబంధాలు ఎక్కడో తేడా కొట్టాయని, అందుకే ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు. రాజకీయ నాయకుల కుటుంబాలకు బండి భగీరథ్ అంశం ఒక గుణపాఠం లాంటిదని అభిప్రాయపడ్డారు.
పరిష్కారం అవుతుంది
చివరకు ఈ కేసును ఆ రెండు కుటుంబాలు కలిసి కూర్చొని పరిష్కరించుకుంటాయని తాను భావిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు.